Breaking News

Loading..

ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి :మచ్చా వెంకటేశ్వర్లు..

  •  భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
  • ఈ అకాల వర్షాల వలన విషయ ద్వారా బారిన నుండి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని
  • సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు

దుమ్మగూడెం మండలం ములకపాడు సెంటర్ యలమంచి సీతారామయ్య భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వారం రోజుల నుండి ఎండాతిరపలేని భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలందరూ అప్రమంతంగా ఉండాలని ఆవులకు. మేకలకు చేపల వేటకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచన చేశారు, అదేవిధంగా అనేకమంది వాగుల్లో చెరువులలో పడి మృతి చెందుతున్నటువంటి వారికి ప్రభుత్వం ఎక్సర్గేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు, అంతేకాకుండా ప్రతి గ్రామాలలో రామ గ్రామాన మెడికల్ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎందుకంటే ఈ భారీ వర్షాల కారణంగా విష జ్వరాలు వలన అనేకమంది మంచాల బారిన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని అన్నారు, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మరియు రైతు రుణమాఫీలు రాలేదని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని రేషన్ కార్డు లేదని మీకు రాదని ఇటువంటి మాటలు చెప్పి ఇంటికి పంపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం అవుతున్నారు అన్నారు


 ఇటువంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలి, అదేవిధంగా కొత్త రుణాలు వీలైనంత త్వరగా ఇచ్చే విధంగా కృషి చేయాలని గుర్తు చేశారు, పోడు భూములకు ఇచ్చిన హక్కు పత్రాలు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను ఆయన డిమాండ్ చేశారు, లేదంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు, కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, మర్మం సమ్మక్క, సోడి రాంబాబు, మహమ్మద్ బేగ్, కొమరం చంటి, యానబోయిన వెంకట నరసయ్య, సోయం వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments