Breaking News

Loading..

అప్పుకు లేని షరతులు మాఫీ కి ఎందుకు: కనకయ్య. సిపియం

 


 గోరంత ఋణం మాఫీ సేసిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత ప్రచారం చేసుకుంటుందని, కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాలు అన్నీ హామీలకు ఎక్కువ అమలుకు తక్కువ చందంలా ఉన్నాయి అని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వ పాలనా తీరు పై ఎద్దేవా చేసారు. సీపీఐ (ఎం) మండల కమిటీ ఆద్వర్యంలో మండల కమిటీ సభ్యుడు ముళ్ళగిరి గంగరిజు అద్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశానికి కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మండల కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో 5 లక్షల 7 వేల 987 మంది అర్హులైన ఋణ గ్రహీతలు కు రూ.415 కోట్ల 34 లక్షలు 86 వేల 332 లు రద్దు చేయాల్సి ఉండగా,1 లక్షా 88 వేల 34 మందికి 1 వేయి 816 కోట్లు మాత్రమే రద్దు చేసారని వీరి శాతం 23 మాత్రమేనని అన్నారు. అప్పు ఇచ్చేటప్పుడు లేని షరతులు ఋణమాఫీ సమయంలో విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రూ.2 లక్షలు ఋణమాఫీ చేస్తామని ఎన్నికల వాగ్ధానం చేసి అంతకంటే ఎక్కువ ఉన్న అప్పు తీర్చి తేనే ఈ రూ.2 లక్షలు అప్పు మాఫీ చేస్తాను అనడం పొమ్మన లేక పొగ పెట్టిన సామెతలా ప్రభుత్వం వ్యవహారం ఉందని అన్నారు. అర్హులు అయిన రైతుల పేర్లు లోని అక్షర దోషాలు,ఆధార్ లోని లోపాలు,రేషన్ కార్డు లేని కారణాలు చూపుతూ ఋణమాఫీ ఎగవేతకే ప్రభుత్వం చూస్తున్నట్లు అనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేసారు. రూ, 30 వేలు, 50 వేలు,75 వేలు చిన్న మొత్తాలు ఉన్న రైతులకు కొందరికి రద్దు కాకపోవడం అత్యంత బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. షరతులు లేని ఋణమాఫీ కి ప్రభుత్వం ఇప్పటికైనా నడుం బిగించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, మండల కన్వీనర్ చిరంజీవి, మండల కమిటీ సభ్యురాలు తగరం నిర్మల, కారం సూరిబాబు, మడిపల్లి వెంకటేశ్వరరావు, తుట్టి వీరభద్రం, కుంజ మురళి, కలపాల వీరభద్రం, నారం అప్పారావు లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments