ఖమ్మం, సెప్టెంబర్ 20, బిసిఎం10 న్యూస్.
ఖమ్మం పట్టణంలో మొన్న వచ్చిన వరదల కారణంగా అనేక కుటుంబాలు పూర్తిస్థాయిలో నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాలలో ఖమ్మం పెయింటింగ్ చిత్రకారుల(ఆర్టిస్ట్) కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. చిత్రకలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారుల బతుకుల్లో కన్నీరే మిగిలింది. ముంపు ద్వారా నష్టపోయిన చిత్రకారుల కుటుంబాలను ఆదుకోవడం కోసం రాష్ట్ర నలమూలల నుంచి చిత్రకారులు మేము సైతం నీకోసం అని కొంత విరాళాలను సేకరించి ప్రతి బాధిత కుటుంబానికి అర క్వింటా బియ్యం, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు ఆ చిత్రకారుల కుటుంబాలకు అందజేసి చేయూతను అందించారు. ఈ సందర్భంగా చిత్రకళ జేఏసీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భాగస్వామ్యంలో కీలకపాత్రను పోషిస్తున్న మా చిత్రకలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఇతర వృత్తి కళాకారులను గుర్తించినట్లుగా వారికి కేటాయించిన కార్పొరేషన్ నిధులను ఎలాగైతే చేస్తున్నారో కళనే నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయని కావున ఇకనైనా మా కళాకారులను గుర్తించి మాకంటూ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా సంక్షేమానికి తక్షణమే వెయ్యి కోట్ల బడ్జెట్ ను కళాకారులకు నిధులు విడుదల చేసి ఉపాధి కోల్పోతున్న చిత్రకళా కార్మికులకు తక్షణమే పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని చిత్రకారులకు స్థలం కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, చిత్రకళా రంగంలో అనేక సేవలందించిన కళాకారులు వయసు మీద పడి పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు 50 సంవత్సరాలు దాటిన కళాకారులకు పెన్షన్ రూపంలో ప్రభుత్వం ఆదుకోవాలని, చిత్ర కళాకారుల కుటుంబాల పిల్లలకు కార్పొరేషన్ స్థాయిలో ఉచిత విద్యను అందించాలని, విద్యాహక్కు చట్టం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్లను భక్తి చేయాలని, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో చిత్రకారులకు ఉన్న అవకాశాలను ప్రతిదీ గుర్తించి వారికి కల్పించి, వారిని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రభుత్వలు మమ్మల్ని గుర్తించని ఎడల మా జేఏసీ ఆధ్వర్యంలో ఉధృతమైన పోరాటాలు కొనసాగిస్తామని తెలియపరిచారు. ఇట్టి కార్యక్రమంలో చిత్రకళ జేఏసీ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, గాజుల శ్రీరామ్, మీసాల నాగేశ్వరరావు, గంజి వార్ రామకృష్ణ, దాసరి సీతారాములు, కొత్తూరి మోహన్, మైదం మల్లేష్, కొమ్ము ప్రకాష్, మాడిశెట్టి బాలకృష్ణ, దాసరి బిక్షం, జంగిలి భరత్, యాదన్ రావు, మానుమల్ల కిరణ్, ఉపేంద్ర చారి, కుటుంబరావు, కళ్యాణం రవి, శరత్, వీరభద్రం, షఫీ, సాయి, రాయి విష్ణు, ఖమ్మం చిత్ర కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.

0 Comments