Breaking News

Loading..

భద్రాచలం లో 3వ ఐద్వా రాష్ట్ర మహాసభ..

 .. ముక్యంగా ఐద్వా మహిళల హాల్కుల కోసం ఏర్పడింది అని .. నేడు బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయినదని ఆవేదన వ్యక్తం చేసిన ఐద్వా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి .. గుడిలో బడిలో తేడాలేకుండా మహిళలపట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి అని రక్షించాల్సిన ప్రభుత్వాలు దోషులకు వత్తాసు పల్కుకున్నాయన్నారు


నేడు డ్రగ్స్ మహమ్మారి పెట్రేగిపోతుందని సొంత బిడ్డలే శత్రువులుగా మారుతున్నారు అని వాటిని సమూలంగా నిషేదించకపోతే పెనుప్రమాదం తప్పదని అన్నారు .. దేశం లో అనేకచోట్ల మహిళలు అత్యాచారాలకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వాలు చట్టాలు తెస్తున్నామంటున్నారు కానీ వాటిని అమలు చెయ్యటం లో పూర్తిగా విఫలం అయ్యారు అన్నారు .. 


కలకత్తాలో జరిగిన డాక్టర్ పై అత్యాచారం హత్య కేసు ను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు అని ..అక్కడ హాస్పిటల్ లో అనేక స్కాములు వెలుగులోకి రాకుండా ఉండటానికి మహిళను ఎరా చూపి అత్యాచారం కేసు తో ముడిపెట్టారు అని ఆరోపించిన ఉపాధ్యక్షురాలు శ్రీమతి సరళ .. ఇప్పటికైనా ప్రభుత్వాలు పటిష్ట చట్టాలు తెచ్చి వాటిని సత్వరమే అమలు అయ్యేవిదంగా చూడాలి అని డిమాండ్ చేస్తున్నం అన్నారు .. ఈ మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ రూపించుకుంటాం అని ఇప్పటి వరకు జరిగిన వాటిపై సమీక్ష చేసుకొని లోటుపాట్లను సరిదిద్దుకుని అన్నారు .. ఈ మహా సభకు విచ్చేసిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు 




Post a Comment

0 Comments