భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పర్యటన భాగంగా ఆర్డిఓ ఆఫీస్ లో అధికారులతో ఏర్పాటు చసిన గోదావరి వరదలపై రివ్యూ మీటింగ్ లో పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
![]() |
| మంత్రి తుమ్మల నాగేశ్వరరావు |
అందులో భాగంగా భద్రాచలంలో నీటి సరఫరా ఎలా ఉందని ఎన్ని గంటలు సరఫరా చేస్తున్నారని నీటిపారుదల శాఖ వారిని మంచి తుమ్మల నాగేశ్వరావు అడిగారు. దానికి సమాధానం చెబుతూ రోజుకి గంట సరఫరా చేస్తున్నామని అన్నారు అధికారులు. చుట్టూ గోదావరి ఉండి కూడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎందుకని వెంటనే నిరంతరం నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని దానికి కావలసిన ప్రణాళికలు చర్చించి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి అధికారులకు ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సమావేశంలో మంచుతోపాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఐటిడిఏ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్లకు మంచి అనుభవం ఉందని వారు గొప్ప అవకాశం గా భావిస్తున్నారని వారి సేవలు సద్వియోగం చేసుకోవాలని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి జిల్లా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి అభిప్రాయం ఉందని ఎటువంటి సహకారం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అందుతుందని దీని దృష్టిలో పెట్టుకొని మనందరం రాజకీయాలకు అతీతంగా భద్రాద్రి ఇవి అభివృద్ధి పథంలో నడపడానికి దోహదపడాలని అన్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు


0 Comments