ఆరోగ్య హాస్పిటల్ - టిఆర్ఆర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపు.
ఖమ్మం , సెప్టెంబర్ 22, బిసిఎం10 న్యూస్.
స్థానిక వెంకటేశ్వర నగర్ 48వ డివిజన్ లో మున్నేరు వరద ముంపులో సర్వస్వం కోల్పోయిన అనేక కుటుంబాలకు సీజనల్, చర్మ వ్యాదులకు, దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించి మందులను ఇచ్చే దిశగా ఆదివారం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించినారు. ఈ సందర్భంగా డాక్టర్లు మోపర్తి సుమంత్, పొన్నం ప్రియాంక, తోట లక్ష్మణ్ మాట్లాడుతూ వరద ముంపు వల్ల సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఇక్కడి కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తోట గోవిందమ్మ రామారావు దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారితో పాటు పలువురు డాక్టర్లు, తోట రమేష్, వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్, బాబా వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments