అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు సెప్టెంబర్ 19 న భద్రాచలం పట్టణం లో జరగ నున్నాయని, ఈ మహా సభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు, భద్రాచలం పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. సంఘం పట్టణ ఆఫీస్ బేరర్స్ సమావేశం సున్నం గంగా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డి. సీతాలక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 19 న జరగనున్న జిల్లా మహాసభల సందర్భంగా భద్రాచలం పట్టణంలో మహిళలతోటి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మహాసభలో మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు అమలుపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలులో ఉచిత ఆర్టీసీ బస్సు తప్ప మిగతా గ్యారెంటీలు అమల్లోకి రాలేదని అన్నారు. కావున, మిగతా ఐదు గ్యారెంటీలు పగడ్బందీగా అమలు చేయాలని ఆమె అన్నారు. పట్టణం లో ప్రతి ఏరియాలో విషపు జ్వరాలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఏరియాలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ లీలావతి, ఏ సక్కుబాయి, జి జీవన్ జ్యోతి ,జి రాధా, యు జ్యోతి, ఎం రమ, గౌతమి ఏ జే ఎం సుబ్బలక్ష్మి, జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 Comments