భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం లోగల పి హెచ్ సి ఆసుపత్రిలో సమయపాలన పాటించని వైద్యులు మరియు సిబ్బంది.
అసలే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి గారు అందరూ ఉద్యోగం చేసే కేంద్రంలోనే ఉండాలని వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించి అందుబాటులో ఉండాలని చెబుతూ ఉంటే, ఇక్కడ నరసాపురం ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఎప్పుడూ కూడా సమయపాలన పాటించరు.
ఉదయం 9 గంటలకు రావలసిన సిబ్బంది సమయానికి రారు మీరు సమయపాలన పాటించకపోవడం వల్ల ఆసుపత్రికి వచ్చే పేద రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదుల ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఫలితం శూన్యం. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి సమయపాలన పాటించిన వారి పై చర్యలు తీసుకొని పేద ప్రజలకు పేద రోగులకు న్యాయం చేయగలరని స్థానికులు కోరుకుంటున్నారు.



0 Comments