Breaking News

Loading..

మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు లొంగుబాటు..


బిసీఎం10 న్యూస్ ఆగస్ట్ 26 ఎట్టపాక :  మావోయిస్టు సిద్ధాంతాల పట్ల విసుగు, పార్టీలో వివక్ష, ప్రజల్లో మావోయిస్టులపై ఆదరణ తగ్గడం, పోలీసుల నిఘా పెరగడం, నాయకుల వ్యవహారాల పట్ల అసంతృప్తి వంటి కారణాలతో పార్టీని వీడినట్లు వారు వెల్లడించారు. అలాగే తమ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.  ప్రభుత్వ సరెండర్ & పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన వారికి అర్హత మేరకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీలో ఉన్నవారు స్వచ్ఛందంగా సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి లొంగిపోవచ్చని సూచించారు.   ఈ కార్యక్రమంలో చింతూరు సబ్ డివిజన్ ఏఎస్పీ బి. హేమంత్, చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. గోపాల కృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

For Ads Please Contact 9000790313..

Post a Comment

0 Comments