Breaking News

Loading..

ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

బిసిఎం 10 న్యూస్ మే 27 భద్రాచలం

బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం కుటుంబాలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఏజెన్సీ ఏరియాలోని మారుమూల మండలాల ఆదివాసి గ్రామాల లోనీ ఆదివాసి గిరిజనులకు, అధ్యాపకులకు, విద్యార్థిని, విద్యార్థులకు సేవలందిస్తున్న ముస్లిం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని తెలిపారు. రంజాన్ తర్వాత వచ్చే రెండో అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ అని ఆయన అన్నారు. త్యాగాలకు ప్రతీ కగా చెప్పే బక్రీద్ పండుగను ముస్లింలు కుటుంబాలు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

For ADVT/INTERVIEWS..CONT : 9000790313

                  WWW.BCM10NEWS.IN

BCM.BHADRACHALAM10@GMAIL.COM

Post a Comment

0 Comments