అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు. అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, రవికుమార్ శర్మ, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి శ్రీ రాఘవేంద్ర బట్టల షాప్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సత్య ప్రసాద్ శర్మ, కృష్ణమాచార్య, కదంబరి కృష్ణ శర్మ, రామాచార్యులు, కంజర్ల సుబ్రహ్మణ్యం, తేజ శర్మ, వీరభద్ర శర్మ, స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.





0 Comments