Breaking News

Loading..

సీనియర్ యుటిఎఫ్ నాయకులు, ఆల్ పెన్షనర్స్ సభ్యులు అయిన జె. వీరభద్రరావు మృతి..

బిసిఎం10 న్యూస్ మే 17 భద్రాచలం

 భద్రాచలంలోని రంగనాయకుల గుట్ట పైన ఉన్న ఎస్ ఆర్ ఎస్ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు.వీరు పనిచేసిన కాలంలో విద్యను అభ్యసించిన  అనేకమంది వివిధ రంగాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఇంజనీర్లుగా, వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నారు.వీరు ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) సంఘంలో నాయకులుగా కూడా పనిచేశారుm జె వీరభద్రరావు మృతి చెందిన విషయాన్ని  తెలుసుకొని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెన్షనర్స్ నాయకులు వారి ఇంటికి వెళ్లి వీరభద్ర రావు మృతికి సంతాపం తెలిపి వారి భౌతి కాయంపై పూలదండలు వేసి జోహార్లు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించి . వారి కుటుంబానికిప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్  అసోసియేషన్  అధ్యక్షులుబందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, సీనియర్ ఉపాధ్యక్షులు ముగడ(M) హరనాథ్, గౌరవాధ్యక్షులు సిహెచ్ సుబ్బయ్య చౌదరి, కార్యదర్శి టి శివప్రసాద్, కార్యదర్శి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు పంపన సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మల్యాల కిషన్ రావు, రిటైర్డ్ ఏఎస్ఐ బైరు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments