ఖమ్మం, 30 ఏప్రిల్, బిసిఎం10 న్యూస్.
'ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్' నూతన కార్యాలయం మే 3వ తేదీన ఘనంగా ప్రారంభం కానుంది. గట్టయ్య సెంటర్ సమీపంలోని మహారాష్ట్ర బ్యాంక్ భవనంలో రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం జర్నలిస్టులకు ఒక సమగ్ర వేదికగా రూపుదిద్దుకోనుంది. జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఒకే వేదిక పైకి వచ్చి పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు ఇది కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఈ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించుకునే వేదికగా ఇది నిలిచి, ప్రజా ప్రయోజనాల సాధనలో కీలకంగా మారనుందని తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్, ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫసియుద్దీన్, ఉపాధ్యక్షులు వి ఆర్ కే రాజు, అవినాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావెళ్ల రవి కుమార్, జాయింట్ సెక్రటరీ పి ప్రణీత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారత్నం పాల్గొన్నారు. జిల్లా ఎక్క్యూటివ్ మెంబర్ నరేంద్ర కుమార్, జిల్లా ఎక్క్యూటివ్ మెంబర్ లోకేష్, తోట మురళి, పాలేరు రామకృష్ణ, వినయ్, ఆర్ కే, ఆనంద్, సాల్మన్ శ్రీనివాసరావు, పి వెంకటేశ్వర్లు తదితర జర్నలిస్టులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.


0 Comments