Breaking News

Loading..

స్వర్గీయ దర్శి శ్రీరామమూర్తి 16వ వర్ధంతి సందర్భముగా సరోజిని వృద్ధాశ్రమములో అన్న ప్రసాద వితరణ..


బిసిఎం10 న్యూస్ ఏప్రిల్ 19 భద్రాచలం : స్వర్గీయ దర్శి శ్రీరామమూర్తి 16 వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలోని సరోజినీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ జరుగుటకు ముందు సమావేశం ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తొలి తరం తెలంగాణ పోరాట యోధులు, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు అయిన తిప్పన సిద్ధులు. మరియు ప్రముఖ రోటరీ నాయకులు, లైన్స్ క్లబ్ సభ్యులు, ఆల్ పెన్షనర్స్ సభ్యులు అయిన యోగి సూర్యనారాయణ, అజీమ్, కన్నయ్య లాల్. కే ఎస్ ఎల్ వి ప్రసాద్. సుబ్బయ్య చౌదరి. యుటిఎఫ్ సీనియర్ నాయకులు దర్శి శ్రీరామమూర్తి బంధువు అయిన ఎస్ రాజా శ్రీనివాస్. దర్శి తిరుమలరావు. తదితరులు స్వర్గీయశ్రీరామమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతులమీదుగా వృద్ధులకు అన్నం ప్లేట్లను అందించారు. 





ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్. జి.మురళీకృష్ణ. సుబ్రహ్మణ్యం.చుక్క రాంబాబు. రామరాజు.కిషన్ రావు. నాళం సత్యనారాయణ. జి.సి.సి. కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్., స్వరూప్.తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాశ్రమం సరోజమ్మకు సత్కారం.

 వృద్ధాశ్రమంను సరోజిని గత అనేక సంవత్సరముల నుండి వృద్ధాశ్రమం స్థాపించి వందలాదిమంది వృద్ధులకు అనాధలకు ఆశ్రమం కల్పించి సేవలు అందిస్తున్నందున సరోజమ్మకు శాలువలతో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షులు. మరియు తిప్పన సిద్ధులు. యే గి సూర్యనారాయణ. అజీమ్. రాజా శ్రీనివాస్ తిరుమలరావు కె ఎస్ ఎల్ వి ప్రసాద్ సుబ్బయ్య చౌదరి తదితరులు సత్కరించి ఆల్ పెన్షనర్స్ నూతన డైరీ ని క్యాలెండర్ ను అందజేశారు. అనంతరం ఇటీవలే పదవీ విరమణ చేసిన సరోజమ్మ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం ను తీసుకోవడం జరిగింది.

Post a Comment

0 Comments