ఖమ్మం, మార్చ్ 29, బిసిఎం10 న్యూస్.
'ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ (రిజిస్టర్ నెంబర్ 95/2020)' ఆధ్వర్యంలో నూతన సభ్యత్వం పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు కీలక బాధ్యతలు కేటాయిస్తూ బలమైన కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు ఐ ప్రభాకర్ వెల్లడించారు. మీడియా రంగంలో నిబద్ధత, పారదర్శకత, ప్రజల పట్ల బాధ్యతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కొత్త కమిటీలో బాధ్యతలు స్వీకరించినవారు జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ నరేంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా డి నరేష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎండి ఫసుద్దీన్, జిల్లా కార్యదర్శిగా వెంకట్రాజు కేశిరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీగా మాచర్ల సాల్మన్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారిగా పి ప్రణీత్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రావెళ్ల రవి కుమార్, ఖమ్మం డివిజన్ సెక్రటరీగా డి అవినాష్, మొత్తం తొమ్మిది మంది సభ్యులతో కమిటి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఐ ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి దిక్సూచి లాంటి వారు కావాలని, నిష్పక్షపాతంగా నిజాలను వెలికితీసి ప్రజలకు చేరవేయడంలో ముందుండాలని సూచించారు. మీడియా ఐక్యతతో ఖమ్మం జిల్లాలో సమాచార వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

0 Comments