బిసిఎం10 న్యూస్ మార్చ్ 27 భద్రాచలం : భద్రాచలంలో శ్రీరామనవమి పర్వదినంనకు దేశ నలుమూలల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వచ్చిన యాత్రికులకు భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చే యాత్రికులకు భక్తులకు కదంబం, వడపప్పు, పానకం, తాటి ముంజలు,చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, మరియు చల్లటి మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు
భక్తులకు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఐ టి సి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మరియు రిటైర్ ఉద్యోగులైనటువంటి ఆల్ పెన్షనర్స్ పై తెలిపిన భక్తులకు పెద్ద ఎత్తున అందజేశారు
వారు సేదదీరేందుకు టెంట్లను వేసి విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లను చేసి భద్రాచలంలో యాత్రికులకు స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని దేశం నలుమూలల భద్రాచలం కీర్తి వెనపడేలా వ్యవహరించటం గర్హనీయమని వచ్చినటువంటి భక్తులు ప్రశంసించటం అలాగే వృద్ధులైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలాంటి సేవలు చేయటం ఎంతో ప్రశంసనీయమని వారు కొనియాడారు.
ముందుగా పుచ్చకాయ ముక్కలను ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చల్లగుల్ల నాగేశ్వరరావు . భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ డి కృష్ణమూర్తి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం చంద్ర సుబ్బయ్య చౌదరి రాజబాబు తదితరులు చల్లగుండ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు.
భద్రాచలం పట్టణ ప్రముఖులు అయినT. ధనేశ్వరరావు ( సా మిల్లు ధనం ) పానకంను, వడపప్పును, తాటి ముంజలను, వారి చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ముందుగా శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఫోటోకు పూలదండలు వేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాద వితరణ ప్రారంభించారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగ నాయకులు అయినా ఎం వి ఎస్ నారాయణ, టి ముత్తయ్య. ఐ టి సి రిటైర్డ్ నాయకులు ఎస్ అజయ్ కుమార్, సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్, పి కోటేశ్వరరావు ( జిసిసి ) మాదిరెడ్డి రామ్మోహనరావు, గౌరవాధ్యక్షులు చం డ్రసుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, కోశాధికారి డి కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, జగన్మోహనరావు, మరియు మహిళలు శ్రీమతి దారా నళిని. శ్రీమతి శిరీష. శ్రీమతి కళావతి, మరియు సూరిశెట్టి కృష్ణ, సీత్యా నాయక్, వి రాంబాబు, కొండలరావు, నాళం సత్యనారాయణ, అక్కయ్య, శ్రీమన్నారాయణ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.













0 Comments