భద్రాచలం మార్చ్ 22 బిసిఎం10 న్యూస్
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి చేనేత కళాకారులు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను తయారుచేసి సీతారాములకు సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఎక్స్ చైర్మన్ ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పట్టు వస్త్రాలు తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలోని పద్మశాలి సంఘం నాయకులు కార్యకర్తలు ఎస్ ఎస్ జయరాజు గారిని ఘనంగా సన్మానించారు. పి సత్యనారాయణ, డి వెంకటేశ్వరరావు, వి రమేష్, పి రవీందర్, జి రాజు, E సూరిబాబు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలి సంఘానికి అత్యున్నత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు

0 Comments