Breaking News

Loading..

ఆల్పెన్షనర్స్ ఆధ్వర్యంలో నవమి నాడు నిర్వహించే కార్యక్రమాలపై సమీక్ష సమావేశము..

 


భద్రాచలం మార్చ్ 22 బిసిఎం10 న్యూస్

 ఆల్పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయంలో బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో. భద్రాచలంలో జరిగే ది 27. 3. 26న శ్రీరామనవమి పర్వదినంనకు విచ్చేయుచున్న భక్తుల యొక్క సౌకర్యార్థం మన సంఘం పక్షాన పానకం, వడపప్పు,మంచినీళ్ల ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ ప్యాకెట్లు,తాటి ముంజలు, తదితరాలను పంపిణీ చేయుటకై సమావేశము నిర్ణయించడం అయినది. కావున 27.3. 20 26 శుక్రవారం జరిగే శ్రీరామనవమి సందర్భముగా ఒకరోజు ముందుగా అనగా 26. 3. 20 26 గురువారం సాయంత్రానికి మనం నిర్ణయం తీసుకున్న కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాలలో పాల్గొని 27. 3.26 శుక్రవారం జరిగే శ్రీరామనవమికి భక్తులకు పై తెలిపిన ఏర్పాట్లలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అలాగే మన పెన్షనర్స్ అందరూ కూడా మన కార్యాలయముకు శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా హాజరవ్వాలని కోరుతున్నాం.స్వచ్ఛందంగా పై తెలిపిన పదార్థాలను పంపిణీ చేయుటకు రావలసిందిగా కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 





Post a Comment

0 Comments