భద్రాచలం మార్చి 10 బిసిఎం10 న్యూస్
భద్రాచలం టెంపుల్ సిటీలో ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ లేకపోవడం శోచనీయమని మానవ హక్కుల పరిరక్షణ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సీతారాముల పుణ్యక్షేత్రంగా భద్రాచలం ఖ్యాతిగాంచిందని, ప్రపంచ కీర్తి పొందిన శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను ప్రజలకు చేరే విధంగా పత్రికా ప్రతినిధులు తమ పత్రికలు, టెలివిజన్ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ వార్తలను సమకూర్చడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రెస్ క్లబ్ కోసం స్థలం కేటాయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. గత 40 ఏళ్లుగా పత్రికలు, ఛానళ్లలో పనిచేసిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారని చెప్పారు.భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి రాజకీయ నాయకులు, అధికారులు, కళారంగ ప్రముఖులు తరచూ వస్తుంటారని, వారు ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చినప్పుడు హోటళ్లలో/ సత్రాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కాబట్టి భద్రాచలం వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని తెలిపారు. ఈ మేరకు సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డి ఏ ఓ కు, ఐటీడీఏ గిరిజన దర్బార్‌లో ఐటిడిఏ ఏపీఓ జనరల్ మేనేజర్ డేవిడ్ రాజుకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీనియర్ పాత్రికేయులు రేపాక రామారావు గుప్తా , గుమ్ములూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

0 Comments