- సాయంత్రం వేళ చెత్త కాల్చడంతో వెదజల్లుతున్న దుర్గంధం.
- శ్వాసకోశ సమస్యలతో స్థానికులు సతమతం.
- వాహనదారులకు వాకర్స్ కు తీవ్ర ఇబ్బందులు.
- గత 4 రోజులుగా పొగతో స్థానికులు ఇబ్బందులు.
భద్రాచలం మార్చ్ 11 బిసిఎం10 న్యూస్ :
భద్రాచలం రాముడు నడియాడిన దివ్య క్షేత్రం మరో 20 రోజుల్లో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం. కల్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.. కానీ కూనవరం రోడ్డు పరిసరాలు మాత్రం కకావికలంగా మారాయి. కరకట్ట పక్కకు చెత్త చెదారాన్ని చేర్చి తగలపెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి పొగ కమ్ముకొని భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. సాయంత్రం పూట అటు వెళ్లేవారు వాకింగ్ చేసేవారు పొగతో తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. గత నాలుగు రోజులుగా పరిస్థితి ఇలాగే ఉన్న కనీసం స్పందించని అధికారులు. ఒకప్పుడు రామాలయం కరకట్ట సమీపంలో ఈ దుస్థితి ఉండగా, ఇప్పుడు కూనవరం రోడ్డు కుమారింది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులకు లోను అవుతున్నారు. శ్వాస కోశ భాదలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

0 Comments