Breaking News

Loading..

లైన్మెన్ దివాస్ సందర్భంగా ఘన సన్మానం..


బిసీఎం10 న్యూస్ 04.02.26 భద్రాచలం :   మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద బుధవారం లైన్మెన్ దివాస్ సందర్భంగా విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న లైన్మెన్లకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఈ రాజారావు గారు పాల్గొని లైన్మెన్ల సేవలను కొనియాడారు. ఎండలు, వానలు, తుఫానులు అనే తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో లైన్మెన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.



విద్యుత్ అంతరాయాల సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసే లైన్మెన్ల సేవలు అమూల్యమని అన్నారు. వారి కష్టాన్ని గుర్తించి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా లైన్మెన్లు మాట్లాడుతూ, ప్రజల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్స్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్స్, లైన్ ఇన్స్పెక్టర్స్, లైన్మెన్స్, అసిస్టెంట్ లైన్మెన్స్, జూనియర్ లైన్మెన్స్, ఆ ర్టిజెన్స్, అన్మండ్ వర్కర్స్,విద్యుత్ శాఖ సిబ్బంది, పాల్గొన్నారు.

Post a Comment

0 Comments