బిసిఎం10 న్యూస్ 7.2.26 భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గతంలో టికెట్ పేరుతో ఎటువంటి సాంస్కృతిక వ్యాపారాలు జరగలేదని ఈనెల 12న జబర్దస్త్ నటులతో ప్రోగ్రాం నిర్వహణకు కొందరు ముందుకు వస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసమని పట్టణ ప్రముఖులు ఫేక్ అజీమ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ షో కు టికెట్లు పెట్టి, స్పాన్సర్లను కూడా చూసుకుంటూ పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ క్రీడా మైదానంలో మనిషికి 300 రూపాయలు పెట్టి వసూలు చేయడం వల్ల డబ్బులు పెట్టి చూడలేని వారు గొడవకు దిగే అవకాశం ఉందని అల్లర్లు చెలరేగి ప్రశాంతత దెబ్బతింటుందని ఒకవేళ మీరు ప్రోగ్రాం పెట్టి వ్యాపారం చేసుకునే ఉద్దేశం ఉంటే ప్రైవేటు స్థలములో ఫంక్షన్ హాల్ లో చేసుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శాంతిభద్రతలు కరవటంతో పోలీసులు తగు చర్యలు చేపట్టారని, ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొల్పబడుతున్న తరుణంలో కుటుంబ సమేతంగా చూడలేని, యువతను మరింత చెడు మార్గంలో పయనింప చేసేలా ఉండే ఇటువంటి ప్రోగ్రామ్స్ ను ప్రోత్సహించొద్దని ఆయన హితవు పలికారు. ప్రభుత్వ క్రీడా మైదానంలో వ్యాపారం చేయవద్దని తిలకించటానికి 300 రూపాయలు టికెట్ ధర పెట్టి అమ్ముతున్నారని ఈ ప్రోగ్రాంకు అనుమతులు ఇచ్చినవారు తక్షణమే పునరాలోచిన చేసుకోవాలని వెంటనే అనుమతులు రద్దు చేయాలని ఆయన కోరారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడి వారిని సన్మార్గంలో నడిపే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

0 Comments