Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం.


బిసిఎం10 న్యూస్ 7.2.26 భద్రాచలం

 సోమవారం అనగా ది 09. 02 .20 26 తేదీన భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో వరంగల్ శరత్ మ్యాక్సీవిజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షలో క్యా టరాక్ట్ కలిగినటువంటి వారిని వారి సొంత వాహనాలలో వరంగల్ తీసుకొని వెళ్లి ఆపరేషన్ చేసి ఉచిత రవాణా సౌకర్యము వసతి సౌకర్యం కల్పిస్తారు ఉచితంగా మందులు కూడా ఇస్తారు ఆపరేషన్ అయిన తర్వాత తిరిగి వారి వాహనాలలోనే తీసుకువచ్చి మన ఆఫీసు వద్ద దించుతారు. మీరు వచ్చునప్పుడు తప్పనిసరిగా హెల్త్ కార్డు ని తీసుకొని రావలసిందిగా కోరుతున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మరియు ఉద్యోగులు ఉపాధ్యాయులు ,పోలీసు వారు, జర్నలిస్టులు, మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా అర్హులే అలాగే ఉచితంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షలు 09.02.2026 సోమవారము ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తారు క్యాటరాక్టుకలిగిన వారిని అదే రోజు మధ్యాహ్నం వారి వాహనాలలో తీసుకొని వెళ్తారు . కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరుతూ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఓ ప్రకటనలో కోరారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు,టి శివప్రసాద్, గొ ర్సా మురళీకృష్ణ,విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, పంపన సత్యనారాయణ మాదిరెడ్డి,రామ్మోహనరావు, నాలం సత్యనారాయణ, ఎం కొండలరావు, వి రాంబాబు, చుక్కా రాంబాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments