Breaking News

Loading..

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

 జితేష్ వి పాటిల్


బిసీఎం10 న్యూస్ 11.02.26 కొత్తగూడెం

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో జగ్గు తండ ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మన గళాన్ని వినిపించడానికి ఓటు హక్కు శక్తివంతమైన సాధనం అని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు, అవసరమైన సిబ్బంది నియామకం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్ల కోసం వీల్‌చైర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.అన్ని వర్గాల ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరితగతిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


 

Post a Comment

0 Comments