Breaking News

Loading..

కొత్తగూడెంలో కొలువుదీరిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు...


బిసిఎం10 న్యూస్23.02.26 కొత్తగూడెం

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారిల సమక్షంలో కొత్తగూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 8 మంది కార్పొరేటర్లు వేల్పుల వీరమ్మ, మల్హోత్రా సాగర్, భీమా శ్రీవల్లి, గుగులోత్ రాంబాబు, మల్లెల స్వప్న, సింధు తపస్వి, బత్తుల మధుచంద్, గుణ చరిత్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన మున్సిపల్ కమిషనర్ కె. సుజాత 

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కార్పోరేటర్లకు సన్మానం

ప్రమాణస్వీకార అనంతరం బిఆర్ఎస్ కార్పొరేటర్లను ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. ఆయన సూచన మేరకు స్థానిక బిఆర్ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. 8 మంది కార్పొరేటర్లకు శాలువా కప్పి, పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్ లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, సయ్యద్ ఇస్మాయిల్, బీమా శ్రీధర్, మల్లెల రవిచంద్ర, కాంపెల్లి కనకేష్, కొట్టి వెంకటేశ్వర్లు, బొమ్మిడి రమాకాంత్, బొమ్మిడి శ్రీకాంత్, రాజేష్ (కన్ని), సంకు బాపన అనుదీప్, ముత్యాల రాజేష్, కరాటే శ్రీనివాస్ యాదవ్, బట్టు మంజల, వీరన్న, డాబా శంకర్, దుర్గాప్రసాద్, వాసుమల్ల గౌతం, మరియు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments