Breaking News

Loading..

 


 బిసిఎం10 న్యూస్ 25.02.26 భద్రాచలం

 ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు అయిన బందు వెంకటేశ్వరరావు సతీమణి శ్రీమతి బంధు శారద 5వ వర్ధంతి సందర్భంగా ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శ్రీమతి శారద చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు పూలదండ వేసి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం శ్రీ చల్లగుల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమతి శారద చిన్న వయసులోనే మరణించడం బాధాకర విషయమని శ్రీమతి శారద లేని లోటు పూడ్చటం ఎవరి వల్ల కాదని అయినా కూడా వారు పెన్షనర్ల సమస్యల పరిష్కారములో నిత్యం ఫన్షనర్ల మధ్య ఉండటం వలన వారికి కొంత ఊరట కలిగిందని అభిప్రాయపడ్డారు. కోశాధికారి డి కృష్ణమూర్తి డివిజన్ ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, ఉపాధ్యక్షులు విష్ణు మొలకల బద్రినాథ్ విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. దుర్గాప్రసాద్, యాటకాని సత్యనారాయణ రిటైర్డ్ రేంజర్ శ్రీ డి వెంకటేశ్వర్లు శ్రీ పరిటాల సుబ్బారావు. హెచ్ ఆంజనేయ శాస్త్రి. బన్సీలాల్. సూరిశెట్టి కృష్ణ, రామరాజు తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. 



 వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం : కూనవరం రోడ్డులోని సరోజినీ వృద్ధాశ్రమంలో 150 మంది పైగా వృద్ధులకు అన్న ప్రసాద వితరణ జరిగింది 

ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కార్యకర్తలు నాయకులు పాల్గొని భోజనాన్ని వృద్ధులకు అందించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సరోజినీ వృద్ధాశ్రమం ఎంతో చక్కగా నడుస్తుందని గత ఐదు సంవత్సరాల నుంచి బందు శారద పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెబుతూ అంతే కాకుండా మా పెన్షనర్స్ సోదరులు ఈ వృద్ధాశ్రమంలో శుభకార్యాలను మరియు ఆ శుభకార్యాలను కూడా నిర్వహిస్తూ ఎంతో కొంత వృద్ధులకు సహాయ సహకారాలను అందిస్తున్నామని అలాగనే అందరూ ఈ రకంగా చేసి వృద్ధులకు తోడ్పాటుగా ఉంటూ సరోజినీ వృద్ధాశ్రమానికి చేయూతనివ్వాలని సరోజినీ వృద్ధాశ్రమ నిర్వాహకురాలైనటువంటి సరోజమ్మకు అందరూ తోడ్పాటు నివ్వాలని కోరారు. 


సంఘం సలహాదారైనా మాదిరెడ్డి రామ్మోహనరావు వేరొక పనిమీద వెళుతూ ముందుగానే వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో టి శివప్రసాద్, చుక్క రాంబాబు , సీత్యా నాయక్ పి కృష్ణయ్య,T. దాసు. ఐ . వి. వి. సత్యనారాయణ, నాయుడు రామారావు, ఎన్ జగన్మోహనరావు, ఎస్ ఐ బైరు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments