బిసీఎం10 న్యూస్ 14.02.26 భద్రాచలం
ఈ నెలలో ముంబైలో జరిగిన వరల్డ్ రెన్ షూ ఖాన్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యం లో నేషనల్ లెవెల్ కరాటే పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,బూర్గంపాడు మండలం, సారపాక గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ రెడ్డి, శ్రీవాణి దంపతుల కూతురు సహస్ర రెడ్డి సిల్వర్ మెడల్ సాధించి ద్వితీయ స్థానంలో నిలిచినందున 14వ వార్డు మెంబర్ కొమరం సావిత్రి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ మరియు ఉప సర్పంచ్ కన్నె దారి రమేష్ లు హాజరైనారు.ఈ సందర్భంగా జరిగిన సభలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో రాణిస్తున్న అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారుఅందులో భాగంగా సీఎం కప్ క్రీడలు కూడా ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలలో నిర్వహిస్తూ ప్రతిభ ఆధారంగా గుర్తించి తగిన ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్య కారణంగా సారపాక ప్రాంత క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు తమ పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తరఫున అందించాల్సిన సంక్షేమ పథకాలతో పాటు ప్రతి విభాగంలో తమ తోడ్పాటు ఉంటుందని అన్నారురాబోయే కాలంలో సారపాక ప్రాంతంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయించి ప్రతి ఒక్కరికీ ఉన్నత శిఖరాలకు చేరే విధంగా ప్రోత్సహించునున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న పాలకవర్గం ప్రజలకు ,క్రీడాకారులకు దూరంగా ఉండి వ్యక్తిగత స్వార్ధంగా ఎదుగుదలను చూసుకున్నారే తప్ప సారపాక ప్రజల కోసం కానీ, వివిధ రంగాల వర్గాలకు చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక ప్రాంతం దినదిన అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉండే విధంగా ప్రయత్నిస్తున్నానని అన్నారు.తక్కువ సమయంలోనే అన్ని వర్గాల లోకి, అన్ని రంగాల లోకి తమ పాలకవర్గం సమన్వయంతో దూసుకు వెళ్తుందని అన్నారు . పగడాల సహస్ర రెడ్డి సారపాక ప్రాంత ప్రజానికానికి స్పూర్తి దాయకంగా నిలుస్తున్నందుకు అభినందించారు ఉప సర్పంచ్ కన్నదారి రమేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే తన ప్రతిభను కనబరుస్తూ ఎందరుకో ఆదర్శంగా నిలుస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు వారి కోసం నా వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మరియు తన పాలకవర్గ సభ్యులతో కూడా కలిసి ప్రోత్సాహ బహుమతులు అందించనున్నట్లు తెలిపారుఅనంతరం పగడాల సహస్ర రెడ్డి తల్లిదండ్రులయిన పగడాల మధుసూదన్ రెడ్డి, శ్రీవాణి ,నాయనమ్మ దేవేంద్రమ్మ,మరియు కరాటి మాస్టర్ కిరణ్ ను ఘనంగా సన్మానించారుఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ప్రసశించారు. ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ ప్రముఖులు శేశిరెడ్డి , మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, 15వ వార్డు నెంబర్ కళ్యాణి, సారపాక ప్రజలు మల్లేష్ రెడ్డి,బొడ్డు నాగరాజు, శేఖర్, సాయి, ఏంపల్లి వెంకటరెడ్డి, సోనా, జరుపల వీరమ్మ, జ్యోతి, శాంత, సునీత ,అరుణ, చందు, సీతా ధనలక్ష్మి, శశిరేఖ, తదితరులు పాల్గొన్నారు

0 Comments