Breaking News

Loading..

నేషనల్ యూత్ డే అవుట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – సామాజిక వర్గాల భాగస్వామ్యంతో ముందడుగు.

బిసిఎం10న్యూస్ జనవరి 6 భద్రాచలం: స్వామి వివేకానంద జయంతి (నేషనల్ యూత్ డే)ను పురస్కరించుకుని భద్రాచలం పట్టణం, భగవాన్ దాస్ కాలనీలో 2026 జనవరి 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్న అవుట్‌డోర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో నిర్వహించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్ నిర్వాహకులు పట్టణంలో సంప్రదింపుల కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో  రైస్ అండ్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కంభంపాటి సురేష్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ పోకాల శ్రీనివాస్, భద్రాచలం ఆదివాసీ సమితి నాయకులు అడ్వకేట్ శ్రీ పాయం రవి వర్మ, ఆంధ్రప్రభ విలేఖరి మరియు కిరణ్ ఫ్లెక్స్ యజమాని శ్రీ రాజా కిరణ్ని నిర్వాహకులు కలసి టోర్నమెంట్ ఉద్దేశాలు, యువతపై దీని ప్రభావం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆహ్వానం స్వీకరించిన వారు మాట్లాడుతూ, యువతను సానుకూల దిశలో నడిపించడంలో క్రీడలు అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక అవగాహన, బాధ్యత, సహజీవన భావన పెంపొందించడంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు కీలకంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. యువతకు ఈ టోర్నమెంట్ ఒక మంచి వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ, సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ సంప్రదింపుల కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కుంజా సంతోష్, అంబు, తాళ్ళ రమేష్, శీలం నాగరాజు, సున్నం వినోద్, కణితి నవీన్, ఏలం సురేష్, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments