Breaking News

Loading..

అల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనందుకు ఘన సన్మానం.



ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం కార్యాలయంలో భద్రాద్రి జిల్లా టిఏపిఆర్పిఏ అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన సన్మాన సభ జరిగింది.

 ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు తెలంగాణ సాధన పోరాట యోధులు శ్రీ తిప్పన సిద్ధులు, విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ. హాజరయ్యారు. ముందుగా సభాధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం పెన్షనర్లకు నాయకత్వం వహించే డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావుకు డిసెంబర్ 29, 30 తేదీలలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆరవ రాష్ట్ర మహాసభలు జరిగాయని ఆ సభల లో పెన్షనర్ల అనేక 


 సమస్యలను చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తీర్మానాలను చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలని. పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని. నగదు రహిత హెల్త్ కార్డులను ఇవ్వాలని, ప్రతి జిల్లాకు ఒక వెల్నెస్ సెంటర్ ప్రారంభించి అందులో నిష్ణాతులైన వివిధ రకాల స్పెషలిస్టులైన డాక్టర్స్ ను నియమించి ఉచిత పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లను చేయాలని. 2024 సంవత్సరం తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావలసిన పెన్షన్ బెనిఫిట్స్ అయిన గ్రాట్యుటీ కమ్యూటే షన్, జిపిఎఫ్ తదితరాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

 అనంతరం జరిగిన రాష్ట్ర తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావును రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తమ సంతోషాన్ని ముఖ్య అతిథి అయిన శ్రీ తిప్పన సిద్ధులు గారు జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎo వి ఎస్ ఎస్ నారాయణ భద్రాచలం డివిజన్ గౌరవాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి డివిజన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికా రి కృష్ణమూర్తి, మాదిరెడ్డి రామ్మోహనరావు ఎస్ రాజబాబు తదితర పెన్షనర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కాబడిన బంధు వెంకటేశ్వరరావును పుష్పగుచ్చాలని ఇచ్చి పూలదండలతో శాలువాలతో సన్మానించారు.

 సన్మాన గ్రహీత బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వారు తనకు అప్పగించిన పదవికి బద్ధుడనై ఉండి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.    

 ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు ముత్తయ్య, రెడ్డి. డి ఎస్ ఎన్ రెడ్డి మరియు ఐటిసి నాయకులు అజయ్ కుమార్ కో ల్ మైన్స్ నాయకులు బంధు నరసింహారావు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శివప్రసాద్ మురళీకృష్ణ రాంబ్రహ్మచారి అక్కయ్య పంపన సత్యనారాయణ నాళం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యక్షుడుఎస్ రాజబాబు వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

 సమావేశానంతరం స్వీట్స్, పులిహోర, తదితరాలను పంచుతూ 2026నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం సమావేశం ముగిసింది..


















Post a Comment

0 Comments