Breaking News

Loading..

ఘనంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర 6వ మహాసభలు


తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆరవ మహాసభలు హైదరాబాదులోని బాగ్లింగంపల్లిలో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ది. 29.12.25,మరియు 30.12.2025 రెండు రోజులు రాష్ట్ర మహాసభలు జరిగిన అనంతరం రాష్ట్ర మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలలో భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

 ఈ సందర్భంగా బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గానికి నా కృతజ్ఞతలను తెలుపుకుంటూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలియజేశారు

 

Post a Comment

0 Comments