- మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్
- భద్రాచలంలో ఘనంగా ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు.
స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ముందుకు సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను కొప్పుల రవీందర్ ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970లో డిసెంబర్ నెల 30 తేదిన కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లో ఏర్పడిందనీ విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారత దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు,నాటి నుండి నేటివరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారత దేశంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని దేశంలో ఉన్నటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు ప్రైవేట్ కార్పొరేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్య రంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని విద్యారంగ సమస్యలను బాగుచేయలన్నారు.ఈ కార్యక్రమంలో చందు వర్ధన్, ప్రశాంత్, కార్తీక్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments