Breaking News

Loading..

కామ్రేడ్ బండారు శ్రీదేవి 7వ వర్ధంతి సభ ..

  •  ప్రజా పోరాటాలు కొనసాగించడమే కామ్రేడ్ బండారు శ్రీదేవికి మనమిచ్చే ఘన నివాళి..
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు..

బిసీఎం10 న్యూస్ జనవరి 22 భద్రాచలం

ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించడమే అమరజీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి కి మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. ఐద్వా సీనియర్ నాయకులు, మార్క్సిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు అమర జీవి కామ్రేడ్ బండారు శ్రీదేవి 7వ వర్ధంతి సభ ఐద్వా పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మచ్చ మాట్లాడుతూ కామ్రేడ్ బండారు శ్రీదేవి పార్టీ, మహిళా సంఘం ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారిని అన్నారు. శ్రీదేవి గారి సహాయ సహకారాలతో బి బి జి తిలక్ పూర్తి కాలం కార్యకర్తగా పార్టీలో పని చేశారని అన్నారు.భద్రాచలం పట్టణ ప్రజాతంత్ర ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని మహిళలు అత్యధికమంది ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావటం విశేషమని అన్నారు. నేడు మహిళలపై జరుగుతున్న దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణంగా పెరుగుతున్న అసమానతలు పెరుగుతున్న పేదరికం తదితర ప్రజా సమస్యలపై విస్తృతంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని అదే ఆమెకి ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ముందుగా శ్రీదేవి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్,కుటుంబ సభ్యులు బి బి జి తిలక్, డి లక్ష్మి,నాదెళ్ల లీలావతి లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, 20 వార్డు మెంబర్ ఇరప అనసూయ, పార్టీ సీనియర్ నాయకులు పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి యు జ్యోతి,జీవనజ్యోతి, అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, కనక శ్రీ,ఎన్. నాగరాజు, కుంజా శ్రీనివాస్, డి రాఘవయ్య, ఎం వి ఎస్ నారాయణ, రామకృష్ణ, ఐద్వా నాయకులు వై.పూర్ణ మరియు కుటుంబ సభ్యులు బండారు వరుణ్ కుమార్ సత్యనారాయణ చిన్న ప్రతాప్ సుందరయ్య లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments