బిసిఎం10 న్యూస్ జనవరి 26 భద్రాచలం
ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయం ముందు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి తదనంతరం జాతీయ పతాకాన్ని డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితంగా నే స్వాతంత్ర్యం సిద్ధించింది అని నేడు అట్టి పలాలను అనుభవిస్తున్న ప్రతి భారతీయుడు ఆ మహానుభావుల్ని మననం చేసుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉందని తెలుపుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం బందు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆల్ఫెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం వి ఎస్ నారాయణ గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు, డివిజన్ గౌరవాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి D కృష్ణమూర్తి , విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. రాజబాబు, శివప్రసాద్,మురళీ కృష్ణ,బై రు నరసింహారావు, ముఖ్య అతిధులు బి సుబ్బరాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ తిప్పన సిద్ధులు. వెంకటాచారి, రాంబ్రహ్మచారి, అజయ్, ఎన్ రామారావు, విజయలక్ష్మి, కిషన్ రావు రాజు, తదితరులు పెన్షనర్లను ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తూ పెన్షనర్ల ఉద్దేశించి సమర్పణ తో సమావేశం ముగిసింది.









0 Comments