Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ కార్యాలయం నందు ఉచిత కంటి పరీక్ష..

      

బిసిఎం10 న్యూస్ నవంబర్ 8 భద్రాచలం

భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం నందు వరంగల్ శరత్ మాక్సిజన్ కంటి వైద్యులచే ఉచితముగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. హెల్త్ కార్డు కలిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ ఉచితముగా కంటి పరీక్షలు నిర్వహించి క్యాటరాక్టు కలిగిన వారిని అదే రోజు వారి సొంత వాహనాలలో తీసుకొని వెళ్లి ఆపరేషన్ చేసి తిరిగి మన భద్రాచలం కార్యాలయంలో దింపుతారు. ఉచితంగా మందులు ,ఉచిత రవాణా సౌకర్యము, ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఉచితంగా పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని ది 10 11 20 25 సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తారు. శిబిరానికి వచ్చినప్పుడు హెల్త్ కార్డు తప్పనిసరిగా తీసుకురావలసిందిగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. ప్రధాన కార్యదర్శి  కె ఎస్ ఎల్ వి ప్రసాద్. డి కృష్ణమూర్తి కోశాధికారి ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి. ఎస్ రాజబాబు. టి శివప్రసాద్. సంఘం సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు. దుర్గాప్రసాద్. నాళం సత్యనారాయణ. జి మురళీకృష్ణ, పంపన సత్యనారాయణ. బి రాజు. వీ రాంబాబు. చుక్కా రాంబాబు. ఐ వి సత్యనారాయణ. వీరభద్ర రావు. అక్కయ్య. బైరు నరసింహారావు.తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments