Breaking News

Loading..

ఇసుక కాంట్రాక్టర్లపై అక్రమ సంపాదన వారిపై సి బి సి ఐ డి విచారణ సర్పించాలి. K. రంగారెడ్డి డిమాండ్...

మితిమీరిన ఇసుక బరువు లారీల రవాణా వల్ల చర్ల ,భద్రాచలం రహదారి విధ్వంసం అవుతున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు వున్నట్టు అని, చర్ల మండలంనీ కొటేరు శ్రీనివాస్ రెడ్డి అలియాస్ శ్రీకర్ అక్రమ ఇసుక రవాణా దందాతో విధ్వంసం చేస్తున్నాఅధికారులు ఏం చేస్తున్నారు అని   భద్రాచలం CPIML మాసలైన్ పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి  ప్రశ్నించారు.


బిసీఎం10 న్యూస్ అక్టోబర్ 12 భద్రాచలం

రాష్ట్రంలో ఇసుక అవసరాల పేరిట ప్రభుత్వం తన ఆదాయం పెంచుకొనుటకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిషన్లో మితిమీరి తీస్తున్న ఇసుకను చట్ట విరుద్ధంగా అమితమైన లోడులతో లారీలు రవాణా చేయడం వల్ల జరుగుతున్న రోడ్ల విధ్వంసం చేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడాన్ని CPIML మాసలైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. ఈ విధానాలను చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు పట్టించుకోని అరికట్టాలని లేనియెడల బాధ్యత ప్రజలే ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారని హెచ్చరించారు. ఈ విషయంపై సిబిసిఐడి ద్వారా పరిశీలించి తగున చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయినప్పటికీ ప్రాజెక్టు పేరుతో డిసిల్టేషన్ పూడికతీత పేరుతో టీజీఎండిసి అధికారులు చర్ల మండలంలో ఇష్టానుసారంగా ఇసుకతవాకాలకు అనుమతులు ఇచ్చారు మండలంలో కుదునూరు నుండి సుబ్బంపేట వరకు ఆరు ర్యాంపులు నడుపుతున్నారు. ఇందులో ఆరు నుంచి 10 లక్షల క్యూ మీటర్ల ఇసుక తీసుకునుటకు ఆంధ్ర తెలంగాణ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. వీరు మితిమీరిన ఇసుకను తోడరడమే కాక వందలాది లారీల్లో మితిమీరిన లోడును వేసుకొని గ్రామాల మధ్యలో రేయి పగులు రవాణా చేస్తున్నట్టు తో చర్ల నుండి భద్రాచలం రోడ్డు పూర్తిగా విధ్వంసం అయింది అనే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డుమీద దీచక్ర వాహనదారులు తిరగలేక పోతున్నారు బెంబేలెత్తిపోతున్నారు యాక్సిడెంట్లకు గురవుతున్నారు వర్షం పడ్డప్పుడు గోతుల్లో నీరు ఉండి అర్థం కాక మరీ ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు బయటికి వచ్చి తిరగాలంటే భయపడుతున్నారు బడి పిల్లలు స్కూలుకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి కోడ్లు కుక్కలు, పశువులు మృత్యువాత చెప్పలేం లేము. ఇసుక క్వారీల వల్ల రైతు పంటలు దుమ్ము దూళితో తీవ్రంగా నష్టపోతున్నాయి గ్రామాల్లో రోడ్డు పక్కన గల దుకాణదారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి ఇసుక క్వారీలు నడపాలంటే ఎన్నో నిబంధనలో ఉన్నప్పటికీ వాటిని నిలువునా పాత్ర వేసి చట్ట విరుద్ధంగా సహజ వనరులను దోచుకోవటం దుర్మార్గమైన విషయం కొందరు ప్రజలు వీటిపై మాట్లాడితే రైసింగ్ కాంట్రాక్టర్లు దురుసుగా మాట్లాడటం దాడి చేయడం వంటి సంఘటన కూడా జరుగుతూనటం దుర్మార్గమైన విషయం అన్యాయం కనుక వెంటనే ప్రభుత్వ అందించి ప్రభుత్వం స్పందించి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టి రోడ్ల విధ్వంశాన్ని ఆపాలని రహదారి పుర నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అవసరమైన నిధులు కేటాయించాలని ఆ పని కాంట్రాక్టుల ద్వారానే చేయాలని ట్రాక్టర్ల అక్రమ ఆదాయాల కోసం ఏజెన్సీ అభివృద్ధిని కుంటుపరచరాదని CPIML మాస్ లైన్ డిమాండ్ చేస్తున్నది. లేనియెడల ఎప్పుడో ఒకప్పుడు ప్రజల కోపానికి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వము గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇసుక తవ్వకాలు రవాణాపై సిబిసిఐడి ద్వారా పరిశీలన దర్యాప్తు కూడా చేయాలని. CPIML మాసలైన్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.కొటేరు శ్రీనివాసరెడ్డి, శ్రీకర్ మిగతా కాంట్రాక్టర్లు అక్రమ సంపాదన సంపాదించి ఇసుక ర్యాంపులపై ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతున్న అహంకారాన్ని ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలని వీరి ఆస్తులపై సిబిఐ విచారణ చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్పన,డివిజన్ కమిటీ సభ్యులు దాసరి సాయి, మునిగేలా శివ ప్రశాంత్. తదితరులు.





Post a Comment

0 Comments