బిసిఎం10 న్యూస్ అక్టోబర్ 9 భద్రాచలం
ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కలిసి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందుT A P R P A భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మరియు భద్రాచలం డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో బ్యానరు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ల ఆధ్వర్యంలో నిరసన తెలియ జే శారు. అనంతరం సమస్యలతో కూడిన రెండు మెమోరాండం లను భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీమృణాల్ శ్రేష్టగారిని కలిసి భారత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని .కోరుతూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఈ రెండు మెమోరాండములు పంపించవలసినదిగా కోరుతూ సమర్పించడం అయినది. అనంతరం జరిగిన నిరసన సమావేశంలో జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు గార్లు మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో, మరియు డివిజన్ కేంద్రాలలోనిరసనలు చేసి మెమొరాండాలు పంపించవలసినదిగా తెలంగాణఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు టెలికాం జిల్లా నాయకులు విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. పోస్టల్ డిపార్ట్మెంట్ నాయకులు నిర్మలానందం. నాయుడు రామారావు. ఐటీసీ నాయకులు అజయ్ గారు ఆర్టీసీ నుండి మురళీకృష్ణ. జిసిసి నుండి పి.కోటేశ్వరరావు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లనాయకులు సుబ్బయ్య చౌదరి. పంపన సత్యనారాయణ. ఎస్ రాజబాబు. జి మురళీకృష్ణ. నాళం సత్యనారాయణ. ఏ ఎస్ ఐ .బి. నరసింహారావు. వి రాంబాబు తదితరులు ఈ నిరసన కార్యక్రమములో పాల్గొన్నారు.
![]() |
| సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ఠకి మెమోరాండములను అందజేసిన TAPRPA జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు. భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు. |


0 Comments