Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

 


భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు మహాత్మా    గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ,     మాజీ ప్రధాని.   లాల్ బహుదూర్ శాస్త్రి ల చిత్రపటాలకు పూలదండలను డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణ మూర్తులు వేసి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించారు.


 ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  సత్యం, అహింస నినాదంతో స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని. జై జవాన్, జై కిసాన్ నినాదంతో దేశాన్ని మేల్కొల్పిన లాల్ బహుదూర్ శాస్త్రి  నేటి తరం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం సంఘ నాయకులు చిత్రపటాలకు పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చండ్ర సుబ్బయ్య చౌదరి ,S. రాజబాబు .T. శివప్రసాద్, సంఘం గౌరవ సలహాదారు మాదిరెడ్డి రామ్మోహనరావు, నాయకులు మల్యాల కిషన్ రావు, దుర్గాప్రసాద్, వి రాంబాబు, సీనియర్ నాయకులు వీరభద్రరావు, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం. సిహెచ్ రాంబాబు, రాయ నర్సు, విజయలక్ష్మి ,రాములు, కన్నయ్యలాల్ తదితరులు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు.


Post a Comment

0 Comments