Breaking News

Loading..

విద్యాసంస్థల బంద్ విజయవంతం.SFI-PDSU



  • విద్యాశాఖ మంత్రిని నియమించాలి.
  • స్కాలర్షిప్స్ ,ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి.
  • విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి.
  • NEP-2020 రద్దు చెయ్యాలి.
  • ప్రైవేటు పాఠశాల ,కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.



               బిసిఎం10 న్యూస్ జూలై 23 భద్రాచలం

భద్రాచలం: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీవిద్యాసంస్థల బంద్ విజయవంతం.SFI-PDSU పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు బంద్ నిర్వహించడం జరిగిందని వామపక్ష విద్యార్థి నాయకులు అన్నారు... ఈ కార్యక్రమం SFI జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, PDSU డివిజన్ అధ్యక్షులు రామ్ చరణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం SFI పట్టణ ఇన్చార్జ్ నాయకులు భూపేందర్,PDSU నాయకులు శివప్రశాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని అసమర్ధత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని తక్షణమే నియమించాలని, గత కొన్ని సంవత్సరాలుగా 8,600 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలని, ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని,నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్ పోస్టులు అలాగే ,MEO,DEO పోస్టులను భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలకు కళాశాలలు, హాస్టల్స్ సొంత భవనాలు నిర్మించాలని, సంక్షేమ హాస్టల్స్ జనరల్ హాస్టల్స్ పెండింగ్ లో ఉన్న మెస్ ,కాస్మోటిక్స్ బకాయిలను విడుదల చేయాలని, ప్రవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని, తదితర డిమాండ్ల విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు బందు నిర్వహించడం జరిగిందని వారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగా సమస్యలను తక్షణమే పరిష్కరించిన యెడల విద్యార్థులందరినీ ఐక్యం చేసి , గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో విద్యార్థుల జీవితాలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని వారన్నారు, విద్యారంగ సమస్యలను పరిష్కరించిన యెడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఐక్యం చేసి ఉద్యమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ బంద్ విజయవంతానికి సహకరించిన విద్యార్థులకు పాఠశాల కళాశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో,రామ్ చరణ్, ఆదిత్య స్టాలిన్ మనోజ్ కార్తీక్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments