Breaking News

Loading..

భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి పై జరిగిన దాడి హేయమైన చర్య : ఆల్ పెన్షనర్స్. .



భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి గారిపై పురుషోత్త పట్టణంలో దేవస్థానం భూమిలో కొంతమంది ఆక్రమణదారులు మరియు అరాచకవాదులు కలిసి చేసిన భౌతిక దాడి హేయమైన చర్యఅని ఈ దాడిని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ కమిటీ ఖండిస్తూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు. గతంలో కూడా ఒకసారి ఈవో రమాదేవి పై మరియు ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి దాడిని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది కావున వెంటనే ఈ చర్యలు పాల్పడిన అరాచకవాదులను శిక్షించాలని శ్రీమతి రమాదేవి గారి ఆరోగ్యంపై తక్షణమే మెరుగైన వైద్యం అందించా లని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ఎల్వీ ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు పంపన సత్యనారాయణ మాదిరెడ్డి రామ్మోహనరావు ఎస్ రాజబాబు పి శివప్రసాద్ సుబ్బయ్య చౌదరి వి రాంబాబు ఎం కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

.

Post a Comment

0 Comments