భద్రాచలం ఆగస్టు 1 బిసీఎం10 న్యూస్
భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలో సిసి రోడ్డుపై ఏర్పడుతున్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సేవలు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే, వెంటనే ఆ సిసి రోడ్డును విస్తరించి, వెడల్పు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కుంచాల రాజారాం,పళ్లింటి దేశప్ప, అభినేని శ్రీనివాసరావు ఇంకాకొడాలి చంటి,రేపాక రాంబాబు, కొండవీటి అశోక్, కానమిల్లి రాఘవ,గున్నం రమేష్ బాబు, భాష్యం రమణ, నూతలపాటి దాసయ్య రాజమండ్రి అచ్యుత కొండవీటి చిరంజీవి కొండవీటి రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు.
For Advt Contact www.bcm10news.in: 9000790313


0 Comments