Breaking News

Loading..

'బోయింగ్ విమానాలు - ప్రాణాంతక లాభాపేక్ష' వెనుక దాగి ఉన్న వాస్తవాలు..!!


హైదరాబాద్, జూన్ 13, బిసిఎం10 న్యూస్.

గత కొన్నేళ్లుగా విమానయాన రంగంలో బోయింగ్ పేరు అనేక వివాదాలు, విషాదాలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా, తక్షణ లాభాల కోసం ఈ దిగ్గజ కంపెని అనుసరించిన కొన్ని అనాలోచిత, ప్రాణాంతక వ్యూహాలు వందలాది అమాయక ప్రాణాలను బలిగొన్నాయి. బోయింగ్‌ను 'కిల్లర్ ప్లేన్' అని పిలవడానికి దారితీసిన ఘటనలు, వాటి వెనుక ఉన్న కఠోర వాస్తవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

● ఎయిర్‌బస్ - బోయింగ్ ఒక తీవ్రమైన పోటీ.

యూరోపియన్ యూనియన్ నుంచి ఎయిర్‌బస్ ఏ320 నియో వంటి విమానం మార్కెట్‌లోకి రాగానే, అది తన సామర్థ్యంతో, ఇంధన పొదుపుతో తక్కువ సమయంలోనే అపారమైన ప్రజాదరణ పొందింది. ఆరు గంటల వరకు ప్రయాణాలకు అత్యంత సమర్థవంతంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ నియో కోసం పోటీపడి ఆర్డర్లు ఇచ్చాయి. ఈ పరిణామం బోయింగ్‌కు పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా, ఒక కొత్త విమానాన్ని డిజైన్ చేసి, అభివృద్ధి చేయడానికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది. అంత సమయం వేచి చూడలేక, బోయింగ్ ఒక అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడం కోసం కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన ఎత్తుగడల్లో ఒకటిగా నిలిచిపోయింది.

● బోయింగ్ 737 మ్యాక్స్ పాత బాటిల్‌లో కొత్త వైన్, కానీ విషపూరితమైనది.

బోయింగ్ తన పాత 737 మోడల్‌లో కొన్ని మార్పులు చేసి, దానికి బోయింగ్ 737 మ్యాక్స్ అని పేరు పెట్టింది. ఇది చాలా అద్భుతమైనదని, అత్యంత పొదుపుగా ఉంటుందని గొప్పగా ప్రచారం చేసింది. అయితే, ఇక్కడ అసలు మోసం జరిగింది. విమానం డిజైన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయకుండా, కేవలం పెద్ద ఇంజిన్‌లను అమర్చింది. ఈ ఇంజిన్‌లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తూ, ఇంధనాన్ని ఆదా చేసేలా రూపొందించబడ్డాయి. కానీ, ఈ పెద్ద ఇంజిన్‌ల వల్ల విమానం ఏరోడైనమిక్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. విమానం టేకాఫ్ సమయంలో ముక్కు పైకి లేచేది. అంతేకాదు, పెద్ద ఇంజిన్‌ల వల్ల విమానం తరచుగా అసమతుల్యంగా ఉండేది. ల్యాండింగ్ గేర్‌లను కూడా మార్చకపోవడంతో ల్యాండింగ్ సమయంలోనూ పైలట్లు ఇబ్బందులు పడ్డారు. అంటే, బోయింగ్ కొత్తగా ఏమీ చేయలేదు, కేవలం పాత విమానానికి కొత్త ఇంజిన్‌లను అమర్చి మార్కెట్‌లోకి వదిలేసింది.

● ఎంసిఏఎస్ ప్రాణాంతక 'కిల్లర్ సాఫ్ట్‌వేర్'.

విమానం ముక్కు పైకి లేచే సమస్యను పరిష్కరించడానికి బోయింగ్ ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దాని పేరే ఎంసిఏఎస్ (Maneuvering Characteristics Augmentation System) ఈ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా విమానం ముక్కును కిందికి వంచేలా రూపొందించబడింది. అయితే, ఇక్కడే బోయింగ్ అత్యంత అమానుషమైన చర్యకు పాల్పడింది. ఈ సాఫ్ట్‌వేర్ గురించి ఎయిర్‌లైన్స్ కంపెనీలకు, పైలట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, శిక్షణ కూడా ఇవ్వలేదు. దీని ఫలితం దారుణంగా ఉంది.

● 900+ ప్రాణాలు బలి ఒక క్షమించరాని నేరం.

ఈ 'కిల్లర్ సాఫ్ట్‌వేర్' కారణంగా మూడు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కుప్పకూలాయి. ఈ దుర్ఘటనల్లో 900 మందికి పైగా అమాయక ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన పైలట్లలో ఒకరు భారతీయులు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు, నాలుగు విమానాలు ప్రమాదం నుండి బయటపడ్డాయి. ఈ ప్రాణాంతక తప్పిదం బయటపడిన తర్వాత బోయింగ్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అన్ని 737 మ్యాక్స్ విమానాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల బోయింగ్‌కు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది, కంపెనీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. అయితే, ఇంత పెద్ద నేరానికి పాల్పడిన బోయింగ్, మరణించిన వారి కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు. అమెరికా ప్రభుత్వం కూడా బోయింగ్‌ పై ఎలాంటి జరిమానా విధించలేదు. ఇది అత్యంత విచారకరం.

● డ్రీమ్‌లైనర్ (787) దాని నిరంతర సమస్యలు.

బోయింగ్ యొక్క వివాదాలు 737 మ్యాక్స్‌తోనే ఆగలేదు. వారు విడుదల చేసిన డ్రీమ్‌లైనర్ (787) కూడా నిరంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, ఈ విమానంలో నాసిరకం బ్యాటరీలను ఉపయోగించారు. డ్రీమ్‌లైనర్ కొత్తగా వచ్చినప్పుడు, దాదాపు 14-15 సంవత్సరాల క్రితం, 13కి పైగా విమానాల బ్యాటరీలలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వల్ల మూడు పెద్ద విమాన ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత బోయింగ్ అన్ని డ్రీమ్‌లైనర్‌లను నిలిపివేసి, వాటి బ్యాటరీలను మార్చాల్సి వచ్చింది. అంతేకాదు, ఆ తర్వాత ఈ విమానాల రాడార్ సిస్టమ్‌లోనూ సమస్యలు వచ్చాయి. మళ్ళీ ఒక సంవత్సరం పాటు అన్ని డ్రీమ్‌లైనర్‌లను నిలిపివేసి, వాటిలోని యాక్చుయేటర్లు, రాడార్ సిస్టమ్‌లను మార్చారు.

● గుణపాఠం నేర్చుకోవాలి.

బోయింగ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు కేవలం లాభాల కోసం మానవ ప్రాణాలను పణంగా పెట్టడం అత్యంత ప్రమాదకరమైనది. ఈ ఘటనల నుండి విమానయాన పరిశ్రమతో పాటు ప్రభుత్వాలు, పౌర విమానయాన సంస్థలు కూడా గుణపాఠం నేర్చుకోవాలి. ప్రయాణీకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది నిపుణుల వాదన.

Post a Comment

0 Comments