Breaking News

Loading..

సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన..

  • కరకట్టపై పోస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించాలి..
  • ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామపంచాయతీ అధికారులు..
  • చెత్త పొగతో శ్రీరాముడికి ధూపం వేస్తున్న గ్రామపంచాయతీ అధికారులు.
  •  *సిపిఎం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఆపి ఆందోళన చేస్తున్న ప్రజలు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన


రామాలయంకు కూతవేటు దూరంలో కరకట్ట పై పోస్తున్న చెత్త డంపింగ్ ను పట్టణ శివారుకు తరలించాలని, ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడాలని సిపిఎం ఆధ్వర్యంలో ముదిరాజ్ బజారు, సప్తా దిగువ, రామాలయం పరిసర ప్రాంతాల ప్రజలు కరకట్ట పైకి చెత్తను తరలిస్తున్న పంచాయితీ వాహనాలను అడ్డుకొని ఆందోళన నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం. బి. నర్సారెడ్డి లు మాట్లాతు పట్టణంలో సేకరించిన చెత్తను కరకట్టపై పోసి తగలబెట్టడంతో పొగ కమ్ముకుని రామాలయం వైపు, కాలనీ వైపు పొగ వ్యాప్తి చెందడంతో రామాలయం వచ్చే భక్తులతో పాటుగా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీ ప్రజలు తీవ్ర అస్వస్థలకు గురవుతున్నారని అన్నారు. నిత్యం డంపింగ్ చేస్తున్న చెత్త వల్ల వస్తున్న దుర్వాసన, పొగ కాలుష్యం కారణంగా పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, లివర్, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు  గురవుతున్నారని, ప్రజల ప్రాణాలు తీసుకున్న డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా ఇక్కడి నుంచి తరలించాలని అన్నారు. గతంలో సిపిఎం నిర్వహించిన పోరాట ఫలితంగా సుందరయ్య కాలనీలో చెత్త డంపింగ్ యార్డ్ ను నిర్మించారని, దాన్ని అట్టహాసంగా ప్రారంభించామని చెప్పుతున్న మంత్రులు అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు పట్టణంలో సేకరించిన చెత్తను  కరకట్ట పైన తీసుకొచ్చి ఎందుకు పోస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భద్రాచలం శ్రీరాములు వారికి గ్రామపంచాయతీ చెత్త పొగతో నిత్యం ధూపం పడుతున్నారని విమర్శించారు. ఈ సమస్య పట్ల జిల్లా కలెక్టర్ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఐటీడీఏ పీవో గారు స్పందించాలని కోరారు.ప్రజల ప్రాణాల పట్ల గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే చెత్త డంపింగ్ యార్డ్ ను పట్టణ శివారుకు తరలించాలని లేనియెడల ప్రజా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కమిటీ సభ్యులు చుక్కా మాధవరావు శాఖ కార్యదర్శి ధనలక్ష్మి, స్థానిక ప్రజలు సీత, హైమావతి, రామలక్ష్మి, రమణ, సీతామహాలక్ష్మి, రమేష్,రాంబాబు పిలక రెడ్డి, ఏసు,కళావతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments