Breaking News

Loading..

పాక్‌ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ..

 ఆపరేషన్ సింధూర్..

పాక్‌ ఉగ్రస్థావరాల పై  మెరుపు దాడులు భారత సైన్యం..

ప్రతీకర చర్యలకు పాక్ వ్యూహం

సరిహద్దు ప్రాంతాల్ని కట్టుదిట్టం చేసిన సైన్యం

 


పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. కాగా భారత సైన్యం దాడులను పాకిస్థాన్‌ సైన్యం నిర్ధారించింది. భారత్‌ దాడి చేసిందని ప్రకటించింది. కోట్లి, ముజఫరాబాద్‌, బహవల్‌పూర్‌లపై మిసైల్స్‌తో దాడులు చేసినట్లు పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డట్టు సమాచారం?


Post a Comment

0 Comments