Breaking News

Loading..

సొర్యసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ చర్మ వ్యాధి - డా షేక్ అష్రఫ్ఉద్దీన్, డా కేర్ హోమియోపతి వైద్యులు.

ఖమ్మం, మే 19, బిసిఎం10 న్యూస్.

సొర్యసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ చర్మ వ్యాధి. చర్మ కణాలు వేగంగా వృద్ధి చెందడం వల్ల చర్మంపై మందపాటి, ఎర్రటి, పొడి పొరలుగా ఏర్పడే బొబ్బలను సోర్యసిస్ అంటారు. ఇది అంటు వ్యాధి కాదు, తరచూ మళ్లింపులు, ఉపశమనం కలిగించే లక్షణాలు కలిగి ఉంటుంది. సోర్యసిస్ ప్రపంచవ్యాప్తంగా 0.44% నుండి 2.8% వరకు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇదే తరహాలో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకి వస్తుంది, కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది బై మోడల్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. పురుషులలో ఎక్కువగా 30 నుండి 39, 60 నుండి 69 సంవత్సరాల వయస్సులో కనిపిస్తుంది. మహిళలకు ఇది దాదాపు 10 ఏళ్ల ముందే ప్రారంభం అవుతుంది. సోర్యసిస్ ప్రధానంగా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా ఆరోగ్యవంతమైన చర్మ కణాల పై దాడి చేయడం వల్ల వస్తుంది, అలాగే అనేక ఇతర కారణాల వల్ల కూడా రావొచ్చు. కుటుంబ చరిత్ర, ఆందోళన (స్ట్రెస్), చర్మానికి గాయాలు, ఇన్‌ఫెక్షన్లు (ప్రధానంగా స్ట్రెప్టోకాకస్), కొన్ని ఔషధాలు (బీటా బ్లాకర్లు వంటి), చల్లని వాతావరణం, ధూమపానం, మద్యం సేవనంతో వచ్చే అవకాశాలు ఎక్కువ. సోర్యసిస్ ప్రధానంగా తల, మోచేయి, మోకాళ్లు, నడుము, గోర్లు మొదలైన ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు ఎర్రటి చర్మపు మచ్చలు, మీదకు వెండి రంగు పొరలతో గజగజలాడడం, కాలుతున్నట్లు ఉండటం లేదా నొప్పి, పొడి, పగిలిన చర్మం, రక్తస్రావం కలిగి ఉండవచ్చు. మందపాటి, చీలిన నఖాలు కొన్నిసార్లు పోరిసాటిక్ ఆర్థరైటిస్ కూడా కనిపిస్తుంది. ఈ వ్యాధి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది నిరాశ (డిప్రెషన్), ఆత్మవిశ్వాస హీనతను కలిగిస్తుంది, జీవన నాణ్యతను తగ్గిస్తుంది.

● హోమియోపతి లక్ష్యం లక్షణాలను అణచివేయడం కాదు.

ఇది రోగ నిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడం ద్వారా వ్యాధిని సమూలంగా నయం చేయాలనే దిశగా పనిచేస్తుంది. ఇది మానసిక, జన్యు కారకాలను కూడా చికిత్స చేయడంలో సహాయపడుతుంది, వ్యక్తిగత శక్తివంతత (వైటాలిటి) ను మెరుగుపరుస్తుంది. పేషెంట్లు ఎక్కువగా అడిగే ప్రశ్న ఏం తినాలి..?? ఏం తినకూడదు..?? తినకూడని ఆహారం నూనెలో వేపిన పదార్థాలు, పాల పదార్థాలు, మద్యం, ధూమపానం, సిట్రస్ ఫలాలు (లెమన్, ఆరంజ్), అరటి పళ్ళు. తినాల్సిన ఆహారం ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారం. ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ (అవిసే గింజలు), చియా సీడ్స్, ఆక్రోట్లు (వాల్‌ నట్స్) లో లభిస్తాయి.

Post a Comment

0 Comments