Breaking News

Loading..

ట్రైబల్ మ్యూజియంకు పర్యాటకుల తాకిడి ఎక్కువవుతున్నది.. బి.రాహుల్

గురువారం నాడు రాత్రి ఆయన మ్యూజియం సందర్శనకు పర్యాటకులు వస్తున్న వివరాలను సంబంధిత మ్యూజియం నిర్వహకులను ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ముఖ్యంగా మంచినీరు అందుబాటులో ఉంచాలని, మ్యూజియం చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించినందున పిల్లలు విద్యుత్ దీపాలను ముట్టకుండా చూడాలని, తినుబండారాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలియజేశారు.


పాఠశాల పిల్లలకు మినిమం ఛార్జీతో ప్యాకేజీ ఏర్పాటు చేసినందున పిల్లలను వరుస క్రమంలో మ్యూజియంలోకి వెళ్లే విధంగా చూడాలని, గిరిజన కల్చర్ కు సంబంధించిన అన్ని వివరాలు పిల్లలకు తెలియజేయాలని అలాగే క్రీడా స్థలంలో ఆటలు ఆడుకునే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థుల పట్ల సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని మ్యూజియమును సందర్శించడం అయిపోగానే సురక్షితంగా వారి పాఠశాలలకు తీసుకొని వెళ్లాలని ఆయన అన్నారు.

 

Post a Comment

0 Comments