భద్రాచలం లైన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి కమలా రాజశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్. 20 25-2026 సంవత్సరానికి భద్రాచలం లైన్స్ క్లబ్ కు తొలి మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి పిన్నింటి కమల రాజశేఖర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ నాయకులు. ముందుగా శ్రీమతి కమలా రాజశేఖర్ దంపతులకు పూలదండలను మార్పించి దుస్సాలువులతో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమతి కమల రాజశేఖర్ భద్రాచలం పట్టణంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శివానంద ఆశ్రమంలో మరియు శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటున్న శ్రీమతి కమల రాజా శేఖర్ గారికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు, వారు అనేక స్వచ్ఛంద సంస్థలలో పని చేస్తూ ఈరోజు లైన్స్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం చాలా ఆనందదాయకమని వారికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కమిటీ పక్షాన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ ,కోశాధికారి డి కృష్ణమూర్తి ,ఉపాధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, సంఘం సలహాదారు శ్రీ మాదిరెడ్డి రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు ఎస్ రాజబాబు, నాయకులు విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, దీకొండవెంకటేశ్వర్లు, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
0 Comments