భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డివిజన్ కార్యాలయంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ,మాదిరెడ్డి రామ్మోహనరావు, కె ఎస్ ఎల్ వి ప్రసాద చండ్ర సుబ్బయ్య చౌదరి ,ఎస్ రాజబాబు ,టి శివప్రసాద్, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, రవణగారు,తదితరులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఉద్యోగులు అందరూ చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం మన అదృష్టం అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (భీమ్రావు రామ్ జీ అంబేద్కర్) ప్రముఖ న్యాయవాది అని ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, బౌద్ధ కార్యకర్త, తత్వవేత్త, చరిత్రకారుడు, వక్త, రచయిత, పండితుడు, మరియు సంపాదకుడు కూడా. విదేశాలలో ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ పట్టా పొందిన మొదటి భారతీయుడే కాదు ఆర్థిక శాస్త్రంలో మొదటి పీహెచ్డీ మరియు దక్షిణాసియాలో ఆర్థిక శాస్త్రంలో మొదటి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా అంబేద్కరే అని అన్నారు.
ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థల నుండి 32 డిగ్రీలు పొందిన అసమాన మేధావి, అంటరానితనం, కులం నిర్మూలనకు విశేష కృషి చేశారని భారత రాజ్యాంగ శిల్పి, అంబేద్కర్ చేసిన విశిష్ట కృషికి భారత సమాజం అతని పుట్టిన రోజును అంబేద్కర్ జయంతిగా (1891 ఏప్రిల్ 14) గా జరుపుకుంటారు అని తెలిపారు.
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నామని అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు తెలియజేశారు, ఈ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గూర్చి క్లుప్తంగా మాదిరెడ్డి రామ్మోహనరావు, చండ్ర సుబ్బయ్య చౌదరి, ఎస్ రాజబాబు, జి మురళీకృష్ణ, రవణ, దుర్గాప్రసాద్, నరసింహారావు తదితరులు ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో డి తిరుమలరావు, ఎం కిషన్ రావు, చుక్కా రాంబాబు, కన్నయ్యలాల్, తదితరులు పాల్గొన్నారు.


0 Comments