Breaking News

Loading..

ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ఆఫీస్ నందు నవమి నాడు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

తెలంగాణ ఆల్ పెన్షనర్స్అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ముందు ది.06.04.2025 ఆదివారము భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి సందర్భముగా వివిధ ప్రాంతాల నుంచి నవమికి భద్రాచలం వేలాదిగా భక్తులు వచ్చి శ్రీ సీతారామ కళ్యాణం తిలకించుటకు వస్తారు. అలా వచ్చిన భక్తులకు మండువేసవి లో వారికి దాహము తీర్చుటకు, మరియు వారు సేదదీరేలాగా తాత గుడి సెంటర్లోని పాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా ఉన్న ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ఆఫీస్ ముందు అనేకమంది పెన్షనర్లు కూడి వచ్చిన భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, వడపప్పు, పానకము, మరియు పుచ్చకాయ ముక్కలు భక్తులకు అందజేస్తారు. మా వంతు కర్తవ్యం గా భావించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున విశ్రాంత ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తమ తమ సేవలను అందిస్తారని ఆశిస్తూ ది06.04.2025 ఆదివారం ఉదయం 10:30 కల్లా మన కార్యాలయం కు చేరుకోవలసినదిగా అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు కోరారు. 

ఈరోజు భద్రాచలం కార్యాలయంలో నవమి ఏర్పాట్లను నిర్వహించే కార్యక్రమాలకై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్ కోశాధికారి డి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు డి శివప్రసాద్, ఎస్ రాజబాబు, నాయకులు అయిలయ్య, సుబ్బయ్య చౌదరి, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం.N రామారావు ,పరిటాల సుబ్బారావు. పంపన సత్యనారాయణ , సీరం శెట్టి శెట్టి కృష్ణ తోట నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments