Breaking News

Loading..

సంపన్నులకు దోచి పెట్టే బడ్జెట్ ..CITUజిల్లా అద్యక్షులు కె.బ్రహ్మాచారి..

 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా  సిఐటియు,ఐద్వా,వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలోభద్రాచలంలో నిరసన కార్యక్రమం చేపట్టి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఐద్వా జిల్లాఅద్యక్షురాలు  డి.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులుకె.బ్రహ్మాచారి  మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు, కర్షకులకుమహిళలకు,సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. సంపన్న వర్గాలకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే బడ్జెట్ గా ఉందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థమవుతుందని అన్నారు.ప్రజలకొనుగోలుశక్తిపంచేప్రతిపాదనలు  బడ్జెట్ లోలేవనిపెర్కొన్నారు. దేశ సంపదనంతా కార్పోరేట్లకు దోశ పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా పేదరికం, నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యవాదులు మేధావులు ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్ వ్యతిరేకించాలని కోరారు. కార్మిక వర్గాన్ని నట్టేట ముంచుతూ పెట్టుబడిదారులకు ఉడిగం చేస్తూ ఆర్థిక దివాలా కోరు తనానికి నిదర్శనమని  అన్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి  తీవ్ర నష్టం చేసిందని ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణకు రావాల్సిన నిధులు తేవడంలో పూర్తిగా బిజెపి విఫలమైందన్నారు. తక్షణమే కార్మిక కర్షక వ్యతిరేకమైన బడ్జెట్ ను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.పనిగంటలుపెంచి పెట్టుబడిదారులకు లభాలుపెంచే చర్యలనుబడ్జెట్ లోప్రతిపాదించటం దుర్మార్గయైనచర్యగానాయకులు  విమర్శించారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యంబినర్సారెడ్డి,వ్యవసాయకార్మికసంఘం నాయకులు  గడ్డం స్వావిు,ఐద్వానాయకురాళ్ళు,యు.జ్యోతి,జి.జ్యోతి,కెవిపియస్ నాయకులు కోరాడ శ్రీను సిఐటియునాయకులువేణు,అజయ్,రాయల.రాములు,యంవి.యస్ నారయణ,గజ్జలరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments