Breaking News

Loading..

ట్రైబల్ మ్యూజియం మార్చి నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు : పిఓ బి.రాహుల్..

ఐటీడీఏ ప్రాంగణంలో పర్యాటకుల కోసం సిద్ధం చేస్తున్న ట్రైబల్ మ్యూజియం పనులు చివరి దశకు చేరుకున్నాయని మార్చి నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 


  మంగళవారం నాడు మ్యూజియం కమిటీ సభ్యులతో కలిసి మ్యూజియంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. మ్యూజియం చుట్టూ డిజైన్ గా తయారుచేసిన చెట్లను ఖాళీగా ఉన్న ప్రదేశాలలో అమర్చాలని, మ్యూజియం ద్వారం నుండి మ్యూజియం వరకు వెదురుతో తయారుచేసిన దడికి లైట్ కలర్కు సంబంధించిన రంగులు అందంగా వేయించాలని, బాక్స్ క్రికెట్ కు సంబంధించిన పనులు ఈనెల 25 వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి కావాలని, పది రోజులలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిర్మాణం జరగాలని అన్నారు. అలాగే మ్యూజియం సందర్శించడానికి వచ్చే సందర్శకుల కొరకు వివిధ రకాల తినుబండారాలకు సంబంధించిన స్టాల్స్ కొరకు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని వర్షాకాలంలో కూడా ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో గ్రావెలింగ్ చేయాలని డి ఈ కి ఆదేశించారు. ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని మ్యూజియం నిర్వహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏటీడీఓ అశోక్ కుమార్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, డి ఈ హరీష్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. 


 

Post a Comment

0 Comments